Fri Dec 05 2025 17:33:46 GMT+0000 (Coordinated Universal Time)
Kumari Aunty : కుమారి ఆంటీ డైలాగ్తో హైదరాబాద్ పోలీసులు చలానా..
కుమారి ఆంటీ డైలాగ్తో హైదరాబాద్ పోలీసులు చలానా వేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Kumari Aunty : హైదరాబాద్ ఫుడ్ స్టాల్ వ్యాపారి కుమారి ఆంటీ.. "మీది మొత్తం 1000 అయ్యింది. రెండు లివర్లు ఎక్స్ట్రా" అనే డైలాగ్ తో సోషల్ మీడియాతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయ్యిపోయింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా కుమారి ఆంటీ గురించి మాట్లాడం, సినీ సెలబ్రిటీస్ కూడా కుమారి ఆంటీ గురించి ట్వీట్స్ చేయడం, ఆమెను తమ సినిమాల ప్రమోషన్స్ కి కూడా ఉపయోగించుకోవడంతో ఓ రేంజ్ లో వైరల్ అయ్యారు.
ఈమధ్య టీవీ షోల్లో కూడా గెస్టుగా వస్తూ సందడి చేస్తున్నారు. ఇక తాజాగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సైతం కుమారి ఆంటీ క్రేజ్ ని ఉపయోగించేసుకుంటున్నారు. ఒక బైక్ వాహనదారుడు ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్న ఫోటోని ట్రాఫిక్ పోలీసులు షేర్ చేస్తూ.. "మీది మొత్తం 1000 అయ్యింది. యూజర్ చార్జెస్ ఎక్స్ట్రా" అంటూ చలానాని కుమారి ఆంటీ డైలాగ్ వెర్షన్ లో తెలియయజేసారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
Next Story

