Tue Aug 09 2022 23:33:20 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో భారీ వర్షం

హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. అకాల వర్షంలో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఫెస్టివల్ మూడ్ లో ఉన్న ప్రజలు అకాల వర్షం కారణంగా ఇక్కట్లకు గురయ్యారు. హైదరాబాద్ తో పాటు నల్లగొండ, సూర్యాపేట, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం నమోదయింది. అత్యధికంగా సూర్యాపేట జిల్లా ఎర్కరాంలో 14.5 సెంటీమీటర్ల వర్షం నమోదయింది.
అత్యధికంగా....
రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. హైదరాబాద్ నగరంలోని నాచారంలో 11.3 శాతం వర్షపాతం నమోదయింది. ఎల్పీ నగర్ లో 7.8 శాతం, ఉప్పల్ లో 9.6 శాతం వర్షపాతం నమోదయింది. ఈరోజు కూడా భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
Next Story