Thu Mar 19 2026 11:32:37 GMT+0530 (India Standard Time)
మరో ఐదు రోజులు వర్షాలే
తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.

తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. మరికొన్న రోజులు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. జార్ఖండ్ పై రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
హైదరాబాద్ లోనూ...
హైదరాబాద్ లోనూ గత మూడు రోజుల నుంచి వర్షం కురుస్తుంది. రహదారులన్నీ జలమయమవుతున్నాయి. కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. వాహనాలు కొన్ని ప్రాంతాల్లో మొరాయిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. మ్యాన్‌హోల్ తెరచి ఉంచిన సమయంలో అక్కడ అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించింది.
Next Story

