Fri Dec 05 2025 12:41:13 GMT+0000 (Coordinated Universal Time)
BRS : తెలంగాణ భవన్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి
తెలంగాణ భవన్ కు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేరుకున్నారు

తెలంగాణ భవన్ కు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేరుకున్నారు. పోలీసుల వలయం నుంచి తప్పించుకొని తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానంటూ, అందుకు ఈరోజు తెలంగాణ భవన్ నుండి ఫిల్మ్ నగర్ వేంకటేశ్వర టెంపుల్ వరకు పాదయాత్ర చేసి తడి బట్టలతో ప్రమాణం చేసేందుకు సిద్దం అయ్యారు. పాడి కౌశిక్ రెడ్డి.
అనుమతి లేదని...
పాదయాత్రకు ఎటువంటి అనుమతి లేదని ఉదయం పాడి కౌశిక్ రెడ్డి నివాసం కొండాపూర్ లో హౌస్ అరెస్ట్ చేసిందుకు సైబరాబాద్ పోలీసులు. వెళ్లారు. అయితే పోలీసుల కన్నుగప్పి తప్పించుకుని పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. పాడి కౌశిక్ రెడ్డికి మద్దతుగా తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుకున్నారు. తెలంగాణ భవన్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి ఫిల్మ్ నగర్ టెంపుల్ వద్దకు చేరుకున్నారు. అక్కడ కొద్దిసేపు హడావిడి చేశారు. ప్రమాణం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Next Story

