Fri Feb 13 2026 20:40:59 GMT+0530 (India Standard Time)
సీపీఐకి అన్ కండిషనల్ ఆఫర్ ఇచ్చిన బీఆర్ఎస్
కొత్త గూడెం కార్పొరేషన్ లో హంగ్ ఏర్పడింది

కొత్త గూడెం కార్పొరేషన్ లో హంగ్ ఏర్పడింది. అక్కడ కాంగ్రెస్ కు ఇరవై నాలుగు డివిజన్లు రాగా, సీపీఐకి 22 డివిజన్లు వచ్చాయి. బీఆర్ఎస్ కు ఎనిమిది డివిజన్లు దక్కాయి. కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్, సీపీఐల మధ్య పొత్తు కుదరలేదు. దీంతో రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. అయితే ఏ పార్టీకి మెజారిటీ స్థానాలు రాకపోవడంతో హంగ్ఏర్పడింది.
కీలకంగా మారడంతో..
ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు, బీఆర్ఎస్ అభ్యర్థులు కీలకంగా మారారు. దీంతో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ చేసి తమతో కలసి వస్తే మేయర్ పదవి మీకే ఇస్తామని చెప్పారు. సింగరేణి గనుల్లో అవినీతికి అడ్డుకట్ట వేయాలంటే బీజేపీ,కాంగ్రెస్ ను నిలువరించాలని కోరారు. దీంతో కూనంనేని తమ పార్టీ నాయకత్వంతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బీఆర్ఎస్, సీపీఐ కలిస్తే అక్కడ సీపీఐ అభ్యర్థి మేయర్ గా ఎన్నిక కావడం సులువుగా మారనుంది.
- Tags
- ktr
- cpi
- kothagudem
Next Story

