Sat Sep 14 2024 10:27:45 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో భారీ ఎన్కౌంటర్.. ఆరుగురు మావోల మృతి
తెలంగాణలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు
తెలంగాణలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారని పోలీసు వర్గాలు తెలిపాయి. మృతదేహాలను ఖమ్మం జిల్లా ఆసుపత్రికి తరలిస్తున్నారు.
లచ్చన్న దళానికి చెందిన...
మరో ఇద్దరు మావోయిస్టులు ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా లచ్చన్న దళానికి చెందిన వారుగా గుర్తించారు. కరకగూడెం మండలం రఘునాధపాలెం అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. గాయపడిన మావోయిస్టులను మణుగూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు గ్రేహౌండ్స్ కానిస్టేబుల్స్ కూడా గాయపడ్డారు. వారిని భద్రాచలం ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు.
Next Story