Fri Dec 05 2025 13:53:53 GMT+0000 (Coordinated Universal Time)
Telangana GruhaJyothi: వారికే 500 రూపాయలకు సిలిండర్.. ఈ విషయాలు తెలుసుకోండి!!
తెలంగాణ రాష్ట్రంలో 500 రూపాయలకు సిలిండర్లను అందించనుంది ప్రభుత్వం

Telangana GruhaJyothi:తెలంగాణ రాష్ట్రంలో 500 రూపాయలకు సిలిండర్లను అందించనుంది ప్రభుత్వం. అయితే మహాలక్ష్మి పథకం కింద రూ.500 గ్యాస్ సిలిండర్ పథకానికి తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలకే గ్యాస్ సబ్సిడీ ఇవ్వనున్నారు. ప్రజా పాలనలో గ్యాస్ సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలకు రూ.500లకే సిలిండర్ అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
తెలంగాణ ప్రభుత్వం తాజాగా జీవో విడుదల చేసింది. మహాలక్ష్మి పథకం గైడ్ లైన్స్ ను ఇందులో వెల్లడించింది. రాష్ట్రంలోని మొత్తం 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లలో రేషన్ కార్డు ఉన్న కుటుంబాల సంఖ్య 89.99 లక్షలని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గ్యాస్ సిలిండర్ పై సబ్సిడీ మొత్తాన్ని నెలనెలా ప్రభుత్వం ఆయా కంపెనీలకు చెల్లించనుంది. గ్యాస్ కంపెనీలు లబ్దిదారుల ఖాతాలకు ఆ మొత్తాన్ని బదిలీ చేయనున్నాయి. గ్యాస్ సబ్సిడీ పొందేందుకు తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి. మహిళల పేరుతో ఉన్న గ్యాస్ కనెక్షన్లకే ఈ పథకం వర్తించనుంది. మూడేళ్ల సగటు వినియోగం ఆధారంగా ఏటా ఇచ్చే సబ్సిడీ సిలిండర్లపై నిర్ణయం తీసుకోనున్నారు. ముందుగా మొత్తం ధరను చెల్లించి తీసుకోవాలి.. 48 గంటల్లో సబ్సిడీ మొత్తం బ్యాంకు ఖాతాలో జమకానుంది.
Next Story

