Sun Feb 01 2026 18:06:32 GMT+0000 (Coordinated Universal Time)
ఎంసెట్ పరీక్షలు వాయిదా
తెలంగాణ అగ్రికల్చర్ ఎంసెట్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి అధికారులు తెలిపారు

తెలంగాణ అగ్రికల్చర్ ఎంసెట్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి అధికారులు తెలిపారు. ఈనెల 14, 15వ తేదీల్లో తెలంగాణలో అగ్రికల్చర్ ఎంసెంట్ జరగాల్సి ఉంది. సాంకేతిక విద్యామండలి కమిషనర్ యధాతధంగా పరీక్షలు జరుగుతాయని ప్రకటించిన కొద్దిసేపటికే ఉన్నత విద్యామండలి ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది.
అగ్రికల్చర్ పరీక్షలే....
గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటం, మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలో చెబుతామని ఉన్నత విద్యామండలి అధికారులు చెబుతున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి జరగనున్న ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు మాత్రం యధాతధంగా జరుగుతాయని తెలిపారు. 18,19,20వ తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలు జరుగుతాయి.
Next Story

