Fri Jan 30 2026 08:38:34 GMT+0000 (Coordinated Universal Time)
ఫీజు రీఎంబర్స్ మెంట్ పై హైకోర్టు కీలక ఆదేశాలు
ఫీజు రీఎంబర్స్ మెంట్ పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఫీజు రీఎంబర్స్ మెంట్ పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై వివరణ ఇవ్వాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ సింది. ఫీజు చెల్లించని కారణంగా సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ పలు సంఘాలు దాఖలు చేశాయి. ఈ పిటిషన్ విచారిస్తూ ఫీజు చెల్లించని కారణంగా సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీలపై చర్యలు తీసుకోవాలని తెలిపింది.
తమ సమస్యలను చెప్పుకునేందుకు...
కాలేజీల నుండి వేధింపులకు గురవుతున్న విద్యార్థులు తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఫీజు రీయింబర్స్మెంట్ పట్ల ఉన్న బకాయిలపై రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీలపై చర్యలు తీసుకోవాలని చెప్పింది.
Next Story

