Wed Jan 21 2026 21:59:06 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : సింగరేణి ఎన్నికలు వాయిదా
సింగరేణి ఎన్నికలను వాయిదా వేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది

సింగరేణి ఎన్నికలను వాయిదా వేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 28న ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. నవంబరు 30వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం ఎన్నికలకను వాయిదా వేయాలని హైకోర్టును ఆశ్రయించింది.
డిసెంబరు 27న...
దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సింగరేణి ఎన్నికలను వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాతనే ఎన్నికలు జరిగేలా నిర్ణయం తీసుకోవాలని యాజమాన్యం కోరింది. ఈ పిటీషన్ ను విచారించిన న్యాయస్థానం సింగరేణి ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. డిసెంబరు 27కు ఎన్నికలను వాయిదా వేసింది. నవంబరు 30వ తేదీలోగా ఓటర్ల జాబితాను రూపొందించాలని హైకోర్టు అధికారులను ఆదేశించింది.
Next Story

