Sat Dec 06 2025 02:10:10 GMT+0000 (Coordinated Universal Time)
మునుగోడు కొత్త ఓటర్లపై హైకోర్టు ఆదేశాలివే
మునుగోడు నియోజకవర్గంలో 12 వేల కొత్త ఓటర్ల నమోదుకు అవకాశమిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది

మునుగోడు నియోజకవర్గంలో 12 వేల కొత్త ఓటర్ల నమోదుకు అవకాశమిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈరోజు దీనిపై జరిగిన విచారణలో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఓటర్ల కొత్తగా నమోదు చేయడంపై బీజేపీ పిటీషన్ దాఖలు చేసింది. 25 వేల కొత్త ఓటర్ల నమోదు చేశారని, అవన్నీ బోగస్ ఓట్లేనని, దీనిపై విచారణ జరపాలని పిటీషన్ లో కోరింది.
12 వేల ఓట్లను మాత్రమే....
కొత్తగా వచ్చిన 25వేల ఓట్లలో 12వేల ఓట్లను మాత్రమే వచ్చామని ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది. సాయంత్రం వరకూ వచ్చే దరఖాస్తులు ఇవ్వాలని ఆదేశించింది. ఈ నెల 21వ తేదీ లోపు నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది.
Next Story

