Fri Dec 05 2025 12:23:42 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశం
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి. మాదవీదేవి నేడు తీర్పు వెలువరించారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ఎన్నిక సంఘానికి కూడా ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
90 రోజుల్లోగా...
స్థానిక సంస్థల పదవీ కాలం పూర్తయి ఏడాదిన్నర కావస్తున్నా ఇప్పటి వరకూ ఎన్నికలు జరపలేదంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదని తెలిపారు. అయితే తమకు ముప్పయి రోజులు గడువు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. తమకు అరవై రోజుల సమయం కావాలని ఎన్నికల సంఘం కోరడంతో మొత్తం ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు అవకాశమివ్వాలని కోరింది. ముప్ఫయి రోజుల్లో డివిజన్ ఆఫ్ వార్డ్స్ పూర్తి చేసి, అరవై రోజుల్లో ఎన్నికలు పూర్తి చేయాలని, సెప్టంబరు 30వ తేదీనాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది.
Next Story

