Thu Mar 19 2026 14:16:18 GMT+0530 (India Standard Time)
నేడు హైకమాండ్ వద్దకు నేతలు
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలను హైకమాండ్ ఢిల్లీకి రమ్మని ఆదేశించింది.

నేడు తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఢిల్లీ హైకమాండ్ నేడు చర్చలు జరపనుంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలను హైకమాండ్ ఢిల్లీకి రమ్మని ఆదేశించింది. దీంతో వీరు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో బలోపేతం చేసే అంశంతో పాటు సీనియర్ నేత డి.శ్రీనివాస్ ను పార్టీలో చేర్చుకునే విషయంపైనా వీరు చర్చించే అవకాశముంది.
డీఎస్ చేరికపై.....
డి.శ్రీనివాస్ ఇప్పటికే సోనియాగాంధీని కలిసి పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి కూడా డిఎస్ చేరిక పట్ల సుముఖంగానే ఉన్నారు. దీంతో ఈరోజు, రేపట్లో డీఎస్ చేరికపై స్పష్టత వచ్చే అవకాశముంది. ఆయన రాజ్యసభ పదవీ కాలం కూడా పూర్తి కానుండటంతో టీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో క్రియాశీలకంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు.
Next Story

