Fri Dec 05 2025 15:54:40 GMT+0000 (Coordinated Universal Time)
రేవంత్ రెడ్డిని కలిసిన హీరో నాగార్జున
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హీరో నాగార్జున కలిశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హీరో నాగార్జున కలిశారు. ఈరోజు జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన అక్కినేని నాగార్జున దంపతులు ఆయనతో కాసేపు మాట్లాడారు. తన కుమారుడు అఖిల్ వివాహానికి రావాల్సిందిగా కోరారు. ఈ మేరకు ఆహ్వనపత్రికను నాగార్జున దంపతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అందించారు.
కుమారుడి పెళ్లి ఆహ్వానం...
ఎన్ కన్వెన్షన్ కూల్చివేసిన తర్వాత నాగార్జున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలవడం ఇదే తొలిసారి. అయితే దానితో సంబంధం లేకుండా తన కుమారుడు వివాహానికి రావాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగార్జున దంపతుల ఆహ్వానానికి సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. మొత్తం మీద రేవంత్ రెడ్డి నాగార్జున కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story

