Mon Mar 16 2026 16:52:43 GMT+0530 (India Standard Time)
Telangana : నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణాలో నేడు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

తెలంగాణాలో నేడు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్ కుమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇతర ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది.
ఈదురుగాలులు...
కొన్ని చోట్ల ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొంది. గంటకు ముప్పయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశముందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి.
Next Story

