Sat Mar 07 2026 21:55:42 GMT+0530 (India Standard Time)
Weather Report : తెలంగాణలో నేడు కూడా భారీ వర్షాలు.. ఎక్కడెక్కడంటే?
తెలంగాణలో నేడు కూడా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణలో నేడు కూడా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలంగాణలోని ఏడు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామరెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది.
ఏడు జిల్లాల్లో...
మిగిలిన జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశమందని వాతావరణ శాఖ వివరించింది. ఇప్పటికే గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తీవ్రంగా రైతులు నష్టపోయారు. వ్యాపారులు చితికిపోయారు. ప్రతి రోజూ వర్షాలు పడుతుండటంతో ప్రజలు ఇబ్బందులపాలవుతున్నారు. ఎప్పుడూ లేనంతగా ఈ సీజన్ లో వర్షాలు కురుస్తున్నాయని, ఇక ఈ ఏడాది ఎండలు కూడా అదే స్థాయిలో తీవ్రంగానే ఉండనున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
Next Story

