Mon Jun 05 2023 13:08:46 GMT+0000 (Coordinated Universal Time)
నేడు, రేపు కుండపోత తప్పదట
తెలంగాణలో మరో రెండు రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణలో మరో రెండు రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముంది. నిన్నటి నుంచే వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తెలంగాణలో వాగులు. నదులు పొంగి పొరలుతున్నాయి. ఇవాళ, రేపు కూడా రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
వాగులు, వంకలు...
నిన్న మెదక్ జిల్లాలో అత్యధికంగా 16 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదయింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గామాత ఆలయం వరద నీటిలో మునిగిపోయింది. మంజీరా నది పరవళ్లు తొక్కుతుంది. భారీ వర్షాలకు కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగుతున్నాయి. వరద ప్రవాహం ప్రాజెక్టుల వద్ద పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.
Next Story