Fri Jan 30 2026 02:33:17 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : తెలంగాణలో నేడు భారీ వర్షాలు.. ఈదురుగాలులు.. ఎక్కడంటే?
తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈదురుగాలులు కూడా వీస్తాయని తెలిపింది. కొన్ని జిల్లాలలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి వర్షాలతో పాటు మరికొన్ని చోట్ల ఒక మోస్తరు వర్సాలు కురుస్తాయని ని తెలిపింది. ఈరోజు, రేపు కూడా వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. కొన్నిచోట్ల పిడుగులు పడే అవకాశముందని వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది.
ఈరోజు ఇక్కడ...
ఈరోజు తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఈ సమయంలో గంటకు ముప్పయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ మూడు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నిన్న కూడా కొన్ని జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిశాయని, ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలపింది.
Next Story

