Mon Mar 16 2026 18:38:01 GMT+0530 (India Standard Time)
Telangana : తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలట
తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది

తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో భారీ వర్షాలు మూడురోజుల పాటు కురిసే అవకాశముందని తెలిపింది. తెలంగాణలో నైరుతి రుతు పవనాల రాకతో మూడు రోజులు పాటు కొద్ది చోట్ల భారీగా, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఈదురుగాలులు....
నిన్న హైదరాబాద్ లో వర్షం దంచి కొట్టింది. అనేక జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఈదురుగాలులతో పాటు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలుండటంతో పురాతన భవనాలను ఖాళీ చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు.
Next Story

