Sun Mar 15 2026 16:43:33 GMT+0530 (India Standard Time)
Telangana : తెలంగాణలో మరో ఐదురోజుల పాటు భారీ వర్షాలు
తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న ఐదు రోజుల పాటు తెలంగాణకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు.
ఎల్లో అలెర్ట్....
తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. గంటలకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల మేరకు ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Next Story

