Mon Mar 16 2026 21:47:38 GMT+0530 (India Standard Time)
Telangana : తెలంగాణలో భారీ వర్షం.. రేవంత్ టూర్ రద్దు
తెలంగాణలో భారీ వర్షం కురుస్తుంది. ఈదురుగాలులతో కూడి భారీ వర్షంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

తెలంగాణలో భారీ వర్షం కురుస్తుంది. ఈదురుగాలులతో కూడి భారీ వర్షంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హైదరాబాద్ నగరంలోనూ భారీ వర్షం పడుతుంది. అనేక ప్రాంతాలలో వర్షం కురుస్తుంది. ఈదురుగాలుల దెబ్బకు అనేక ప్రాంతాల్లో విద్యుత్తు సౌకర్యం నిలిచిపోయింది. హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది.
వరంగల్ పర్యటన మాత్రం...
భారీ వర్షం కారణంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరీంనగర్ పర్యటన రద్దయింది. అయితే ఆయన వరంగల్ లో జరిగే రోడ్ షోలో పాల్గొనేందుకు రోడ్డు మార్గాన బయలుదేరి వెళుతున్నారు. వరంగల్ లో జరిగే రోడ్ షోలో ఆయన పాల్గొననున్నారు. భారీ వర్షం కురవడం, ఈదురుగాలులు వీస్తుండటంతో హెలికాప్టర్ ప్రయాణాన్ని ఆయన రద్దు చేసుకున్నారు.
Next Story

