Mon Dec 15 2025 20:44:12 GMT+0000 (Coordinated Universal Time)
ఆదిలాబాద్ జిల్లాలో దంచి కొట్టిన వర్షం
భారీ వర్షాలకు ఆదిలాబాద్ ప్రాంతంలో ప్రజలు ఇబ్బంది పడ్డారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.

భారీ వర్షాలకు ఆదిలాబాద్ ప్రాంతంలో ప్రజలు ఇబ్బంది పడ్డారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పంజాబ్చౌక్,శాంతినగర్,రవీంద్రనగర్, జీఎస్ ఎస్టేట్, భుక్తాపూర్, వికలాంగుల కాలనీ, బొక్కలగూడ, లక్ష్మీనగర్, భాగ్యనగర్, తాటిగూడ, మణిపూర్ కాలనీల్లో వరద ప్రవాహం సంభవించడంతో అవి నీటమునిగిపోయాయి.
తీవ్ర నష్టం...
ఇళ్లలోని సరుకులు, ఎలక్ట్రానిక్ వస్తువులు తడిసి పోయాయి. ప్రభుత్వం ఆదుకోవాలని వరద బాధితుల డిమాండ్ చేస్తున్నారు. మరొకు వైపు భారీ వర్షాలతో ఆదిలాబాద్ జిల్లాలో భారీగా పంట నష్టం జరిగింది. గుడిహత్నూర్, సిరికొండ, తాంసి, తలమడుగు, జైనథ్, బేల,ఇంద్రవెల్లి మండలాల్లో వందలాది ఎకరాల పంట నష్టం జరిగింది. రైతులు తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
News Summary - heavy rains have caused hardship to people in the adilabad area. all low-lying areas have been flooded
Next Story

