Mon Mar 16 2026 15:18:12 GMT+0530 (India Standard Time)
నేడు తెలంగాణకు భారీ వర్షసూచన... ఎల్లో అలెర్ట్ జారీ
తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అనేక జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ప్రధానంగా ఖమ్మం, భద్రాద్రి, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ జిల్లాల్లో...
అాగే ఆసిఫాబాద్, మంచిర్యాల, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయి. అనేక చోట్ల ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల మేర ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది. కొన్ని జిల్లాల్లో మోస్తరు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
Next Story

