Sun Mar 15 2026 12:46:34 GMT+0530 (India Standard Time)
Telangana : నేడు తెలంగాణలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ
తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది

తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. నేటి నుంచి పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఈ జిల్లాల్లో...
సోమవారం నుంచి రేపటి ఉదయం వరకూ నిజామాబాద్, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, ఉమ్మడి ఆదిలాలబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగలాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న మంచిర్యాల జిల్లాలోని కాసిపేటలో అత్యధికంగా ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Next Story

