Fri Dec 05 2025 13:35:48 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : తెలంగాణలో దంచి కొడుతున్న వర్షం.. క్లౌడ్ బరస్ట్ వార్నింగ్
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న మొదలయిన వర్షం పడుతూనే ఉంది. అత్యధికంగా మెదక్ జిల్లాలో ఎక్కువ వర్షపాతం నమోదయింది

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న మొదలయిన వర్షం పడుతూనే ఉంది. అత్యధికంగా మెదక్ జిల్లాలో ఎక్కువ వర్షపాతం నమోదయింది. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ కు అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసి అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరింది. మంజీరా నదికి కూడా భారీ వర్షంతో వరద ప్రవాహం ఎక్కువవుతంోంది. కామారెడ్డి - ఎల్లారెడ్డి మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. చేగుంట - ప్రగతి ధర్మారం వద్ద రాకపోకలు కూడా అంతరాయం ఏర్పడింది. దీంతో పండగ వేళ ప్రజలు గ్రామాలకు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. సిద్ధిపేట్ జిల్లాలోని గజ్వేల్, మిరుదొడ్డి, తొగుట, దుబ్బాక, దౌల్తాబాద్ లో భారీ వర్షం నమోదయింది.
మెదక్ లో అత్యధికంగా...
మెదక్ జిల్లా టెక్మాల్ లో అత్యధికంగా 19.1 శాతం వర్షం నమోదయిందని అధికారులు తెలిపారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ లో 18 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ లో 16.48 సెంటీమీటర్లు, యాదాద్రి జిల్లా భువనగిరిలో 14.93 సెంటీమీటర్లు, మహబూబ్ నగర్ లోని భూత్పూర్ లో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయినట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. దీంతో పాటు ఉమ్మడి నల్లొండ జిల్లాలోనూ భారీ వర్షం కురుస్తుంది. నల్లగొండ, సూర్యాపేట్, భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు, రాజపేట, తుర్కపల్లి, బొమ్మల రామారంలో భారీ వర్షం నమోదయింది. ఇక హైదరాబాద్ నగరంలో కూడా రాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉంది.
ముఖ్యమంత్రి సమీక్ష...
హైదరాబాద్ నగరంలో శామీర్ పేట్, మేడ్చల్, హయత్ నగర్, ఎల్బీనగర్, సరూర్ నగర్, దిల్ సుఖ్ నగర్, నాంపల్లి, అమీర్ పేట్, జూబ్లీహిల్స్, రాయదుదర్గం, కొండాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, లింగంపల్లి, కూకట్ పల్లి ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. అవసరమైన అన్ని ప్రాంతాల్లో జిల్లా, మండల కార్యాలయాల్లో సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. వంతెనలు, కాజ్ వేలపై ప్రమాదకరమైన స్థాయిలో నీరు ప్రవహిస్తున్నందున దాటే ప్రయత్నం చేయవద్దని, అక్కడ వీలయితే పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.
Next Story

