Fri Dec 05 2025 06:25:13 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు పార్టీ మారిన ఎమ్మెల్యేల విచారణ
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్లపై స్పీకర్ ఛాంబర్ లో విచారణ జరుగుతుంది

తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్లపై స్పీకర్ ఛాంబర్ లో విచారణ జరుగుతుంది. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలను విచారించిన స్పీకర్ కార్యాలయం నేడు మరికొందరిని విచారించనుంది. ఉదయం పది గంటలకు ఎమ్మెల్యే గూడెం మహీపాల్ రెడ్డిని విచారించనుంది. బీఆర్ఎస్ న్యాయవాదులు గూడెం మహీపాల్ రెడ్డిని క్రాస్ విచారణ చేయనున్నారు.
బీఆర్ఎస్ అడ్వొకేట్లు...
అలాగే పదకొండు గంటలకు గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని కూడా బీఆర్ఎస్ తరుపున న్యాయవాదులు విచారణ చేయనున్నారు. ఈ విచారణలో తాము పార్టీ మారలేదని ఎమ్మెల్యే నిరూపించుకోవాల్సి ఉంటుంది. అలాగే బీఆర్ఎస్ అడ్వొకేట్ల విచారణలో అడిగే ప్రశ్నలకు ఎమ్మెల్యేలు సమాధానమివ్వాల్సి ఉంటుంది. వరసగా ఎమ్మెల్యేలను విచారించిన అనంతరం స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో అందరినీ తన ఛాంబర్ లో విచారించాలని స్పీకర్ నిర్ణయించి గత నెల 29వ తేదీ నుంచి ఈ విచారణను ప్రారంభించారు.
Next Story

