Fri Dec 05 2025 09:35:58 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : మధ్యాహ్నం 12.30 గంటలకు బీసీ రిజర్వేషన్ పై విచారణ
తెలంగాణ హైకోర్టు బీసీ రిజర్వేషన్ అంశంపై విచారణ మధ్యాహ్నానికి వాయిదా పడింది.

తెలంగాణ హైకోర్టు బీసీ రిజర్వేషన్ అంశంపై విచారణ మధ్యాహ్నానికి వాయిదా పడింది. చీఫ్ జస్టిస్ ధర్మాసనం ఎదుట బీసీ రిజర్వేషన్ లపై ఈ విచారణ జరగనుంది. ఉదయం న్యాయస్థానం ప్రారంభమయిన వెంటనే రిజర్వేషన్ల పై ప్రస్తుత పరిస్థితి ఏంటని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. రిజర్వేషన్లు 42 శాతం పెంచుతూ ప్రభుత్వం జీఓ జారీ చేసిందని తెలిపారు.
ఆరు పిటీషన్ల వాదనలు...
షెడ్యూల్ విడుదల అయ్యిందని బెంచ్ కు న్యాయవాదులు తెలిపారు. సుప్రీంకోర్టులో ఏం జరిగిందని కూడా ధర్మాసనం ఈ సందర్భంగా ప్రశ్నించింది. సుప్రీంకోర్టు తిరస్కరించిన అంశాన్ని కూడా న్యాయవాదులు ప్రస్తావించారు. ఆరు పిటిషన్లు ఒకేసారి వింటామన్న హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ మధ్యానం 12:30 గంటలకు విచారణను వాయిదా వేశారు.
Next Story

