Mon Mar 16 2026 04:54:32 GMT+0530 (India Standard Time)
Kalvakuntla Kavitha : నేడు బెయిల్ పిటీషన్ పై విచారణ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటీషన్ పై నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటీషన్ పై నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. కవిత తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. మార్చి 15వ తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఈడీ, సీబీఐ కేసుల్లో....
తర్వాత తీహార్ జైలులో ఉన్న కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ రెండు కేసుల్లోనూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. కవిత జ్యుడిషియల్ కస్టడీని మే 14వ తేదీ వరకూ పొడిగించింది. దీంతో నేడు ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటీషన్ పై ఎలాంటి తీర్పు రానుందన్న ఆసక్తి నెలకొంది. బెయిల్ వస్తుందా? రాదా? అన్న దానిపై నేడు హైకోర్టులో తేలనుంది.
Next Story

