Sun Mar 08 2026 03:05:05 GMT+0530 (India Standard Time)
Kalvakuntla Kavitha : నేడు కవిత బెయిల్ పిటీషన్ పై విచారణ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటీషన్ పై నేడు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది.

Kalvakuntla Kavitha :బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటీషన్ పై నేడు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేసిన కేసులో కవిత తరుపున న్యాయవాదులు బెయిల్ పిటీషన్ వేశారు. నిన్న ప్రారంభమయిన విచారణ నేడు కూడా ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ చేయనున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15వ తేదీన కల్వకుంట్ల కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. అయితే ఈడీ తర్వాత సీబీఐ కూడా కవితను ఇదే కేసులో అరెస్ట్ చేసింది. సీబీఐ కేసులో కవిత బెయిల్ పిటీషన్ పై విచారించిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. మే 2వ తేదీన తీర్పు వెలువడనుంది.
Next Story

