Sun Mar 08 2026 03:05:04 GMT+0530 (India Standard Time)
Kalvakuntla Kavitha : నేడు కవిత బెయిల్ పిటీషన్ పై విచారణ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటీషన్ పై నేడు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటీషన్ పై నేడు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. రెగ్యులర్ బెయిల్ పిటీషన్ పై న్యాయస్థానం నేడు విచారించనుంది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తో పాటు సీబీఐ కూడా కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కవిత తీహార్ జైలులో ఉన్నారు. మార్చి 15వ తేదీన ఈడీ అధికారులు ఈ కేసులో అరెస్ట్ చేశారు.
తీహార్ జైలులో...
ఈడీ పది రోజులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేసిన అనంతరం మార్చి 26వ తేదీన కవితను తీహార్ జైలుకు తరలించారు. ఈడీ, సీబీఐ ఇప్పటికే తమ కస్టడీలోకి తీసుకుని కవితను విచారణ జరిపింది. నేడు కవిత బెయిల్ పిటీషన్ పై విచారణ జరగనుంది. సీబీఐ, ఈడీ కేసుల్లో వేర్వేరుగా వేసిన పిటీషన్లపై నేడు విచారణ జరగనుండటతో ఉత్కంఠగా నెలకొంది.
Next Story

