Fri Dec 05 2025 22:33:48 GMT+0000 (Coordinated Universal Time)
ఎమ్మెల్యేల ఎర కేసు : నేడు విచారణ
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నేడు హైకోర్టులో విచారణ జరగనుంది

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలన్న పిటీషన్ పై నేడు వాదనలు జరగనున్నాయి. స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం విచారణ పారదర్శకంగా జరగడం లేదని పిటీషనర్ల తరుపున న్యాయవాదులు వాదిస్తున్నారు. ఏకపక్షంగా చర్యలుంటున్నాయని చెబుతున్నారు.
సిట్ దర్యాప్తుపై...
రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లే స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం నడుకుంటుందని పిటీషనర్లు తమ వాదనను వినిపిస్తున్నారు. అందుకే స్వతంత్ర దర్యాప్తు సంస్థ చేత విచారణ జరపాలని వారు కోరుతున్నారు. అయితే సిట్ దర్యాప్తు సక్రమంగానే జరుగుతుందని ప్రభుత్వం తరుపున న్యాయవాది వాదిస్తున్నారు. దీనిపై హైకోర్టులో నేడు మరోసారి విచారణ జరగనుంది.
Next Story

