Thu Jan 08 2026 06:51:22 GMT+0000 (Coordinated Universal Time)
నేడు టిక్కెట్ల రేట్లు పెంపుదలపై హైకోర్టులో
మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల టిక్కెట్ల రేట్ల పెంపుపై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది

మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల టిక్కెట్ల రేట్ల పెంపుపై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. సంక్రాంతికి విడుదల కానున్న తమ సినిమాలకు సంబంధించి టిక్కెట్ల రేట్లను పెంచుకునేలా ఆదేశాలివ్వాలని వేసిన పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారించనున్నారు. సంక్రాంతికి చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారూ, ప్రభాస్ నటించిన రాజా సాబ్ విడుదలవుతున్న నేపథ్యంలో నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు
ప్రత్యేక షోలను కూడా...
.టిక్కెట్ ధరలతో పాటు ప్రత్యేక షోలకు అనుమతివ్వాలని కోరారు. టిక్కెట్ ధరలు పెంచకూడదని సింగిల్ జడ్జి జారీ చేసిన ఉత్తర్వులను నిర్మాతలు హైకోర్టులో సవాల్ చేశారు. ఇప్పటికే ప్రత్యేక షోలకు, టిక్కెట్ ధరలను పెంచుకోవడానికి అనుమతివ్వాలని హోంశాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకున్నామని తెలిపారు. దీనిపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.
Next Story

