Sat Mar 07 2026 18:53:34 GMT+0530 (India Standard Time)
Telangana : ముగిసిన అనర్హత పిటీషన్ పై విచారణ
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటీషన్ పై విచారణ ముగిసింది

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటీషన్ పై విచారణ ముగిసింది. స్పీకర్ గడ్డం ప్రసాదరావు తీర్పును రిజర్వ్ చేశారు. ఈరోజుతో అనర్హత ఎమ్మెల్యేల పిటీషన్లపై విచారణ ముగిసింది. మొత్తం పది మంది ఎమ్మెల్యేలు తమ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి మారినట్లు బీఆర్ఎస్ వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
తీర్పు రిజర్వ్...
సుప్రీంకోర్టు సూచనల మేరకు స్పీకర్ గడ్డం ప్రసాదరావు గత కొన్ని నెలలుగా విచారణ చేస్తున్నారు. అయితే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని తీర్పు చెప్పారు. ఇక కడియం శ్రీహరి, దానం నాగేందర్ విషయంలోనే తీర్పు చెప్పాల్సి ఉంది. ఈ ఇద్దరి విషయంలో తీర్పు ఏ రకంగా వస్తుందన్నది ఉత్కంఠగా మారింది. కడియం శ్రీహరి కూడా తాను పార్టీ మారలేదని చెప్పుకొచ్చారు.
Next Story

