Sun Feb 01 2026 15:04:04 GMT+0000 (Coordinated Universal Time)
రోడ్ల పై నోట్ల కట్టలు.. షాక్ అయిన స్థానికులు
జాతీయ రహదారిపై కుప్పలుకుప్పలుగా కరెన్సీ కట్టలు దర్శనమిచ్చాయి. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

జాతీయ రహదారిపై కుప్పలుకుప్పలుగా కరెన్సీ కట్టలు దర్శనమిచ్చాయి. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఇది కరెన్సీ నోట్ల తుక్కు గా తేల్చారు. హైదరాబాద్ - నాగపూర్ జాతీయ రహదారిపై ఉన్న బుస్సాపూర్ వద్ద ఒక లారీ నుంచి పడిన సంచిని ఇతర వాహనాలను వెళ్లడంతో కరెన్సీ నోట్లు రోడ్డుపై చెల్లాచెదురుగా మారాయి. వీస్తున్న గాలికి కరెన్సీ నోట్లు చెల్లాచెదురయ్యాయి.
బ్లాక్ మనీయేనా?
దీంతో స్థానికులు వాటిని ఏరుకునేందుకు ఎగబడ్డారు. కొందరు స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి కరెన్సీ నోట్లను కొన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ నోట్లను ఎక్కడినుంచి ఎక్కడికి తరలిస్తున్నారు? ఇవి నకిలీనోట్లా? బ్లాక్ మనీయా? అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు.
Next Story

