Thu Jan 29 2026 08:52:41 GMT+0000 (Coordinated Universal Time)
సినిమా సీన్ తరహాలో.. డాక్టర్ ను అక్కడిక్కడే సస్పెండ్ చేసిన ఆరోగ్యమంత్రి హరీశ్ రావు
ఈ ఆసుపత్రిలోని ఓ వైద్యుడు లంచాలు తీసుకుంటాడని కొందరు ఆయనకు ఫిర్యాదు చేశారు. దాంతో ఆసుపత్రికి వెళ్లిన హరీశ్ రావు

తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ ఆసుపత్రిలోని ఓ వైద్యుడు లంచాలు తీసుకుంటాడని కొందరు ఆయనకు ఫిర్యాదు చేశారు. దాంతో ఆసుపత్రికి వెళ్లిన హరీశ్ రావు... వైద్యుడి అవినీతిని గుర్తించి అతడిని అక్కడిక్కడే సస్పెండ్ చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్ నెస్ సర్టిఫికెట్ కోసం ఆ డాక్టర్ లంచం అడుగుతుండడంతో మంత్రి పైవిధంగా చర్యలు తీసుకున్నారు. ఇతర సిబ్బంది కూడా జాగ్రత్తగా ఉండాలని, లంచాలు, అవినీతి జోలికి వెళితే కఠిన చర్యలు తప్పవని హరీశ్ రావు స్పష్టం చేశారు.
ఆరోగ్య మంత్రి హరీశ్ రావు కొండాపూర్ ఏరియా ఆసుపత్రి ఆకస్మిక సందర్శన చేపట్టారు. డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కొరకు డాక్టర్ మూర్తి డబ్బులు అడిగారని బాధితుల ఫిర్యాదు చేయడంతో అక్కడిక్కడే సస్పెన్షన్ వేటు వేశారు. గైనకాలజి వార్డులో ప్రతి రోజూ స్కానింగ్ నిర్వహించాలని.. అదంగా రెండు అల్ట్రా సౌండ్ మిషన్లు పంపుతామని మంత్రి హామీ ఇచ్చారు. గైనకాలజి వార్డులో సదుపాయాలను పరిశీలించడమే కాకుండా.. 60శాతం పైగా సాధారణ డెలివరీలు కావడం పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా పెంచాలని సూచించారు. ఆసుపత్రిలో తిరుగుతూ వైద్య సేవలు ఎలా అందుతున్నాయి, సదుపాయాలు ఎలా ఉన్నాయి అని పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు.
News Summary - telangana health minister harish rao suspends doctor
Next Story

