Fri Mar 20 2026 01:06:40 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో థర్డ్ వేవ్ ముగిసినట్లే
తెలంగాణలో కరోనా థర్డ్ వేవ్ ముగిసిందని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు

తెలంగాణలో కరోనా థర్డ్ వేవ్ ముగిసిందని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. పాజిటివిటీ రేటు 2 శాతానికి లోపు పడిపోయిందని ఆయన చెప్పారు. గత రెండేళ్ల నుంచి కరోనాతో ఎంతో ఇబ్బంది పడ్డామని చెప్పారు. ఎన్నో కష్టాలను ఓర్చుకున్నామన్నారు. ధర్డ్ వేవ్ కూడా తెలంగాణను ఇబ్బంది పెట్టిందని శ్రీనివాసరావు అన్నారు.
ఫీవర్ సర్వే....
అయితే ప్రస్తుతం ధర్డ్ వేవ్ అనేది ముగిసిందని ఆయన చెప్పారు. ఫీవర్ సర్వే మంచి ఫలితాలను ఇచ్చింని ఆయన చెప్పారు. దీకవొరు లోనే తొలి విడత సర్వే పూర్తయిందని చెప్పారు. మంచి వ్యూహాలతో ధర్డ్ వేవ్ నుంచి బయటపడ్డామని ఆయన చెప్పారు. మేడారం జాతరలోనూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. కోవిడ్ కేసులు తగ్గినా ప్రజలు మాత్రం నిబంధనలను పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.
Next Story

