Sun May 19 2024 15:19:25 GMT+0000 (Coordinated Universal Time)
Kotha Prabhakar Reddy : ప్రాణాపాయం తప్పింది కానీ?
ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హెల్త్ బులిటెన్ విడుదలయింది. ఆయన పది రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు.
బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హెల్త్ బులిటెన్ విడుదలయింది. ఆయన మరో పది రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. చిన్న పేగుకి నాలుగు చోట్ల రంధ్రాలు ఏర్పడ్డాయని, అందుకే చిన్న పేగు పదిహేను సెంటీమీటర్ల మేర కట్ చేసి సర్జరీ చేశామని తెలిపారు. కొత్త ప్రభాకర్ రెడ్డిని సకాలంలో ఆసుపత్రికి తీసుకురావడంతో ప్రాణాపాయం తప్పిందని వైద్యులు చెప్పారు. మూడు నాలుగు రోజుల పాటు ఐసీయూలోనే ఉండాలని, డాక్టర్ల నిరంతర పర్యవేక్షణలో ఆయన ఉండాల్సిందేనని పేర్కొన్నారు.
నేడు దుబ్బాక బంద్...
చిన్న పేగుకు నాలుగు చోట్ల గాయాలయ్యాయని, ఇన్ఫెక్షన్ కాకుండా తాము సర్జరీ చేసి నివారించగలిగామని వైద్యులు హెల్త్ బులిటెన్ లో తెలిపారు. కత్తిగాటు తీవ్రత ఎక్కువగా ఉండటంతో టీంగా పనిచేసిన వైద్యులు ఆయనకు సర్జరీని నిర్వహించామని చెప్పారు. సిట ీ స్కాన్ లో లోపల బ్లీడింగ్ అవుతుందని గుర్తించి సర్జరీ చేశామని, ప్రస్తుతం ఆయనకు ప్రాణాపాయం తప్పిందని యశోదా వైద్యులు తెలిపారు. కాగా నేడు కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడికి నిరసనగా దుబ్బాక బంద్ కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది.
Next Story