Tue Jan 20 2026 07:45:27 GMT+0000 (Coordinated Universal Time)
Harish Rao : అవినీతిని ప్రశ్నించినందుకే తనకు నోటీసులు
రేవంత్ రెడ్డి అవినీతిని బయటపెడుతున్నందుకే తనకు సిట్ నోటీసులు జారీ చేసిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు

రేవంత్ రెడ్డి అవినీతిని బయటపెడుతున్నందుకే తనకు సిట్ నోటీసులు జారీ చేసిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ భవన్ వద్ద హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి బావమరిదిపై తాను నిన్న ఉదయం ఆరోపణలు చేశానని, సాయంత్రానికి తనకు సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు జారీ చేశారని, బొగ్గు గని కుంభకోణంలో రేవంత్ రెడ్డి బావమరిది పాత్ర ఉందని తాను ఆధారాలతో చూపించడం వల్లనే ఈ కేసులో విచారణకు పిలిచారన్నారు.
ఆరోపణలు చేసిన సాయంత్రానికే...
ఉదయం ఆరోపణలు చేస్తే రాత్రి తొమ్మిది గంటలకు నోటీసులు జారీ చేసి ఈరోజు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని అన్నారు. మంత్రుల కుంభకోణాలతో పాటు వారి వాటాల పంచాయతీలు వరసగా బయటపడుతున్నాయని, ఆరు గ్యారంటీల అమలు, అవినీతిపై ప్రశ్నిస్తుంటేనే తనకు నోటీసులు జారీ అయ్యాయని, అయితే చట్టాన్ని తాము గౌరవిస్తామని హరీశ్ రావు తెలిపారు. విచారణకు హాజరై తనకు తెలిసిన విషయాలను చెబుతానన్నారు.
Next Story

