Thu Apr 09 2026 11:52:54 GMT+0530 (India Standard Time)
నేడు వనపర్తిలో హరీశ్ సభ
నేడు వనపర్తిలో మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ సభ నిర్వహించనున్నారు

నేడు వనపర్తిలో మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ సభ నిర్వహించనున్నారు. వనపర్తి నియోజకవర్గం రేవల్లి మండలంలో గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి వ్యతిరేకంగా రైతులు వంద రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నారు. వారి దీక్షలకు మద్దతుగా హరీశ్ రావు సభ నిర్వహించనున్నారు.
రిజర్వాయర్ నిర్మాణానికి...
ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు బహిరంగ సభలో హరీశ్ రావు మాట్లాడనున్నారు. హరీశ్ రావు వనపర్తి సభకు హైకోర్టు అనుమతివ్వడంతో అక్కడకు మరికాసేపట్లో బయలుదేరి వెళుతున్నారు. హరీశ్ రావు సభకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Next Story

