Sat Feb 28 2026 16:01:35 GMT+0530 (India Standard Time)
శారదాపీఠం స్థలంపై అధికార ప్రతిపక్ష విమ్శలు
శారద పీఠాన్ని కూల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు

శారద పీఠాన్ని కూల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఎందుకు ఈ దేవాలయాన్ని కూల్చాలి అనుకుంటున్నారని ప్రశ్నించారు. నిత్య అన్నదానం, వేద పాఠశాల, గోశాల, అమ్మవారి ఆలయం, ఇవ్వన్ని ఉండటం ఇష్టం లేదా అని నిలదీశారు. కేసీఆర్ అనవాళ్ళు మారుస్తాను అంటే ఆఖరికి కేసీఆర్ గారు కట్టిన గుడులు కూడా కూలుస్తావా అని హరీశ్ రావు ధ్వజమెుత్తారు. కోకాపేటలో మైనింగ్ కోసం భాగ్యలక్ష్మి మినరల్స్ అండ్ మైనింగ్ వాళ్లకు 10 ఎకరాలు కేటాయిస్తే.. 17 ఎకరాలు కబ్జా పెట్టారన్నారు. ఔటర్ కి కిలోమీటర్ లోపల మైనింగ్ చేయొద్దని హెచ్ఎండీఏ చెప్పిందని, అయినా అక్కడ మైనింగ్ కోసం రేవంత్ రెడ్డి అల్లుడికి అప్పజెప్పారంటూ తీవ్ర విమర్శలు చేశారు.
స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అబద్ధాలపై ఆధారపడ్డవని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తీవ్రంగా ఖండించారు. సీఎం ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కుట్రలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. కోకపేట్ నియోపోలిస్‌లోని విశాఖ శారద పీఠం పరిధిలో ఉన్న రాజశ్యామల అమ్మవారి ఆలయంపై ప్రభుత్వం బలవంతపు చర్యలు తీసుకుంటోందన్న ప్రచారం తప్పుదారి పట్టించేదని శంకర్ పేర్కొన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు అక్కడికి చేరుకుని చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రేరేపితమని, వాస్తవాలను వక్రీకరించి ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నమని ఆరోపించారు.
Next Story

