Thu Feb 13 2025 00:09:16 GMT+0000 (Coordinated Universal Time)
Harish Rao Arrest: బీఆర్ఎస్ నేత హరీష్ రావు అరెస్ట్
ఎమ్మెల్యే గాంధీని విడుదల చేయడంపై బీఆర్ఎస్ నేతలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసంపై దాడి చేసిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, ఆయన అనుచరులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేయడంతో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. అరెస్టయిన వారిలో హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, వద్దిరాజు రవిచంద్ర, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. వారిని శంషాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఎమ్మెల్యే గాంధీని విడుదల చేయడంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనపై హత్యాయత్నం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. గాంధీని అరెస్ట్ చేయకుంటే కోర్టును ఆశ్రయిస్తానని హరీశ్ రావు హెచ్చరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి నివాసంపై గాంధీ అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడం ఈరోజంతా హైడ్రామా నడిచింది. గాంధీ అనుచరులు కౌశిక్ ఇంటిపై గుడ్లు, టమోటాలు విసిరారు, కిటికీలు ధ్వంసం చేశారు. BRS కార్యకర్తలు కుర్చీలతో దాడి చేశారు.
Next Story