Tue Feb 10 2026 22:56:57 GMT+0530 (India Standard Time)
తెలంగాణకు రేవంత్ శాపంగా మారారు : హరీశ్ రావు
తెలంగాణ ప్రభుత్వంపై హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రభుత్వంపై హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనభై శాతం నీళ్లను ఆంధ్రప్రదేశ్ వాడుతుంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ఏపీ కోటా రెండు రోజుల్లో పూర్తవుతుందని, ఏపీ 80 శాతం కృష్ణా నీటిని వినియోగిస్తున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. కేంద్ర జల సంఘానికి లేఖ రాసిన ఈఎన్సీ పదవీ విరమణ చేశారన్నారు. పదవీ విరమణ చేసిన తర్వాత కొత్త ఈఎన్సీని ప్రభుత్వం నియమించలేదన్నారు. తన కోటాను మించి ఏపీ అదనంగా పదహారు శాతం నీటిని వినియోగించుకుందని, మరి హైదరాబాద్ కు నీరు ఎక్కడి నుంచి తెస్తారు? నల్లగొండ, ఖమ్మం ప్రాంతాలకు సాగు నీరు ఎలా ఇస్తారని హరీశ్ రావు ప్రశ్నించారు.
తెలంగాణ హక్కులను కాలరాస్తూ...
పరిపాలన చేస్తున్నారా? లేదా? అని నిలదీశారు. తెలంగాణ కృష్ణా నీటిలో నష్టపోతున్నా కేంద్రాన్ని ఈ ప్రభుత్వం నిలదీయలేకపోతుందని అన్నారు. వాటర్ ఇయర్ ప్రకారం ఏపీ 66 శాతం నీటిని మాత్రమే వినియోగించుకోవాలన్నారు. కానీ అదనంగా వాడుకుంటున్నా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని హరీశ్ రావు మండిపడ్డారు. మన నీళ్లు ఏపీకి రేవంత్ రెడ్డి జార విడుస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి మన రాష్ట్ర హక్కులను కాలరాస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. తెలంగాణకు రేవంత్ రెడ్డి శాపంగా మారారన్నారు. పాలన మీద పట్టులేదని, ఈఎన్సీకి లేఖతో బీఆర్ఎస్ చేస్తున్న వాదనలో నిజముందని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని హరీశ్ రావు తెలిపారు.
Next Story

