Thu Mar 05 2026 10:54:49 GMT+0530 (India Standard Time)
నేడు ఏపీ, తెలంగాణ టెన్త్ హాల్ టిక్కెట్లు విడుదల
పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు నేడు హాల్ టిక్కెట్లు విడుదల కానున్నాయి

పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు నేడు హాల్ టిక్కెట్లు విడుదల కానున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందని విద్యార్థులకు నేడుపదో తరగతి హాల్టికెట్లను విద్యాశాఖ అధికారులు విడుదల చేయనున్నారు. ఈ నెల 16 నుంచి ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అందుకే నేడు హాల్ టిక్కెట్లు విడుదల చేస్తున్నారు.
తెలంగాణలో 14 నుంచి...
తెలంగాణలో ఈ నెల 14 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. హాల్ టిక్కెట్లను ఆ యా రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకునే వీలుంది. ఏపీలో అయితే మనమిత్ర వాట్సప్ ద్వారా కూడా పొందవచ్చు. తెలంగాణ, ఏపీల్లో సంబంధిత పాఠశాలలకు వెళ్లి కూడా హాల్ టిక్కెట్లను పొందచవ్చని అధికారులు తెలిపారు.
Next Story

