Sun Mar 08 2026 06:29:13 GMT+0530 (India Standard Time)
రేపటి నుంచి ఒంటి పూట బడులు
తెలంగాణలో రేపటి నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి

తెలంగాణలో రేపటి నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి. మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 24 వరకు ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. వేసవి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఒంటిపూట బడులను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పదో తరగతి పరీక్షలు
ఉదయం 8 గంటల నుండి 12.30 వరకు తరగతులను నిర్వహిస్తారు. 12.30 కి మధ్యాహ్న భోజనం ఉంటుంది. పదో తరగతి పరీక్షలు జరుగుతున్న సమయంలో పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు.
Next Story

