Sat Dec 06 2025 16:12:52 GMT+0000 (Coordinated Universal Time)
మరో రెండు రోజులు వానలే
తెలంగాణలోని అనేక జిల్లాల్లో వడగళ్ల వానలు పడుతున్నాయి. అకాల వర్షాలకు పంటలు దెబ్బతింటున్నాయి

తెలంగాణలోని అనేక జిల్లాల్లో వడగళ్ల వానలు పడుతున్నాయి. అకాల వర్షాలకు పంటలు దెబ్బతింటున్నాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేతికి వచ్చిన పంట అకాల వర్షంతో చేజారి పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనగామ, సిద్దిపేట, భువనగిరి, స్టేషన్ ఘన్పూర్, చిల్పూర్, కరీంనగర్, హుజురాబాద్, సిరిసిల్ల తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
వడగళ్లతో కూడిన వాన...
నిన్న రాత్రి ఏడు గంటల నుంచి రెండు గంటలపాటు ఈదురుగాలులతో కూడిన వర్షా కురిసింది. మరో రెండు రోజులు అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
Next Story

