Wed Jan 28 2026 10:11:39 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : గ్రూప్ వన్ అభ్యర్థులకు సుప్రీంకోర్టులో చుక్కెదురు
గ్రూప్ వన్ అభ్యర్థులకు సుప్రీంకోర్టులో చుక్కెదురయింది. మెయిన్స్ పరీక్షలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

గ్రూప్ వన్ అభ్యర్థులకు సుప్రీంకోర్టులో చుక్కెదురయింది. మెయిన్స్ పరీక్షలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టులోనే ఈ విషయాన్ని తేల్చుకోవాలని అభ్యర్థులకు సూచించింది. పిటీషనర్ తరుపు కపిల్ సిబాల్ తన వాదనలను విన్నవించారు. ఈరోజు మధ్యాహ్నం గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు జరగబోతున్నాయి.
హైకోర్టులోనే తేల్చుకోవాలని...
అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు తరలి వచ్చే దశలో సుప్రీంకోర్టులో దాఖలయిన పిటీషన్ పై విచారించిన ధర్మాసనం ఈ పిటీషన్ ను పాస్ ఓవర్ చేసింది. అయితే తుది నియామకాలకు ముందే తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టు హైకోర్టును ఆదేశించింది. దీంతో మెయిన్స్ పరీక్షలకు మార్గం సుగమమయింది. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్న దశలో వారిని ఇబ్బంది పెట్టే విధంగా ఉత్తర్వులు ఇవ్వలేమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
Next Story

