Thu Mar 19 2026 16:07:59 GMT+0530 (India Standard Time)
Telangana : తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష వాయిదా?
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడే అవకాశాలున్నాయి. ఈరోజు అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం

తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడే అవకాశాలున్నాయి. ఈరోజు అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం. జులై నెలలో డీఎస్సీ, ఆగస్గు నెలలో గ్రూప్ 2 పరీక్షలను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు టీజీపీఎస్సీ ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
వెంటవెంటనే...
దీంతో అభ్యర్థులు ఈ పరీక్షల కోసం సిద్ధమవుతున్నారు. అయితే గ్రూప్ 2, డీఎస్సి పరీక్షలు వెంట వెంటనే ఉండటంతో తాము రెండు పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు వీలు లేదని నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. కొంత కాలంగా గ్రూప్ 2పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోుగల డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని టీజీపీఎస్సీ గ్రూపు 2 పరీక్షలు వాయిదా వేసే అవకాశముంది. ఈరోజు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని తెలిసింది.
Next Story

