Sun Mar 08 2026 02:37:58 GMT+0530 (India Standard Time)
Breaking : తెలంగాణ నిరుద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్
తెలంగాణలో గ్రూపు 1 మెయిన్స్ పరీక్షకు గ్రీన్ సిగ్నల్ లభించింది. హైకోర్టులో దాఖలయిన పిటీషన్ కొట్టివేయడంతో అభ్యర్థులకు ఊరట లభించింది

తెలంగాణలో గ్రూపు 1 మెయిన్స్ పరీక్షకు గ్రీన్ సిగ్నల్ లభించింది. హైకోర్టులో దాఖలయిన పిటీషన్ కొట్టివేయడంతో అభ్యర్థులకు ఊరట లభించింది. కొందరు గ్రూప్ వన్ పరీక్షలు వాయిదా వేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇరువర్గాల వాదనలను విన్న తెలంగాణ హైకోర్టు గ్రూప్ వన్ పరీక్షలపై దాఖలైన అన్ని పిటీషన్లను కొట్టివేసింది.
యధాతధంగా....
దీంతో యధాతధంగా గ్రూప్ వన్ పరీక్షలు జరుగుతాయి. ఈ నెల 21 నుంచి యధావిధిగా గ్రూప్ 1మెయిన్స్ జరగనున్నాయి. ఈపరీక్షల కోసం అనేక మంది నిరుద్యోగులు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. కానీ న్యాయస్థానంలో కేసులు పడటంతో పరీక్షలు జరుగుతాయో? లేదో? అన్న సందిగ్దత నెలకొంది. హైకోర్టు తీర్పుతో నిరుద్యోగులకు ఊరట లభించింది.
Next Story

