Thu Feb 05 2026 08:20:20 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికయిన అభ్యర్థులకు ఊరట
తెలంగాణ హైకోర్టులో గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికయిన అభ్యర్థులకు ఊరట దక్కింది

తెలంగాణ హైకోర్టులో గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికయిన అభ్యర్థులకు ఊరట దక్కింది. గ్రూప్ 1 నియామకాలపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును చీఫ్ జస్టిస్ ధర్మాసనం కొట్టివేసింది. గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను రద్దు చేస్తూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సీజే ధర్మాసనం రద్దు చేసింది. సింగిల్ జడ్జి మెయిన్స్ జవాబు పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయాలని కూడా ఆదేశిచంారు.
సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు పై...
అయితే సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు పై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో పాటు గ్రూప్ 1 పరీక్ష రాసి అర్హత సాధించిన అభ్యర్థులు కూడా అప్పీల్ చేశారు. దీనిపై గతంలో విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం తీర్పును నేడు వెలువరించింది. దీంతో గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికయిన అభ్యర్థులకు ఊరట దక్కింది. వారికి నియామక పత్రాలను కూడా త్వరలో అందించనున్నారు.
Next Story
