Sat Mar 07 2026 14:42:22 GMT+0530 (India Standard Time)
తిరుమలతో తెలంగాణ గవర్నర్
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నేడు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె ఉదయం శ్రీవారి సేవలో పాల్గొన్నారు

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నేడు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె ఉదయం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. నిన్న సాయంత్రమే తిరుమల చేరుకున్న తమిళిసై రాత్రి అక్కడే బస చేసి ఉదయం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. గవర్నర్ తమిళి సైకి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు.
పండగ పూట....
పండగ పూట స్వామి వారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని తమిళిసై అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో ప్రతి ఒక్కరూ డబుల్ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. తెలుగు ప్రజలందరికీ తమిళిసై సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
Next Story

